Sunday, August 1, 2010

ఓ ప్రాంతీయ లవ్ స్టొరీ - పార్ట్-]]

ఐ నో ...యు కాంట్ ఎస్కేప్ ఫ్రం మై టచ్
నాకు తెలుసు
నువ్వు నన్ను పదేపదే గుర్తు చేసుకుoటున్నావని
నిన్నటి రాత్రి కూడా
పొలమారిన నా గొంతులోన నీ పిలుపు వినిపించింది
పోగలెగిసిన నా గొంతులోన నీ చూపు కనిపించింది
మనిషికి హృదయం ఒకటే కదా...
మరి నాకేందుకబ్బా ఇన్ని బాధలు?
***
నువ్వొచ్చాకే కదా ఈ పూదోటలో నెత్తుటి కాలువ పారింది
నీ కోసం కాలనీ లో ఎంత మందిని కొట్టాను - ఎన్ని పోలీసు కేసులు
నీ కోసమేగా ...ఆ రోజు వాడ్ని తిట్టింది
"నీకు బూతులు కూడా వచ్చా " అని
ఒక రోజంతా అలిగావ్
నిమిషానికి ఒక "సారి " చెప్పించుకున్నావ్
ఆ రోజు నిన్ను ముట్టుకున్న ప్రతీసారి
టచ్ మే నాట్ లా ముడుచుకుపోయావ్
హ హ్హ ..హ హ్హ ..శాడిస్ట్ దాన!
***
నువ్వు ఫస్ట్ టైం నా కోసం చీర కట్టుకున్న రోజు
వర్షం మన కోసమే కురుస్తోంది
నీ తడి చీర దేహం ఫై
నా ముని వేళ్ళతో అలా అలా మీటాను - నీకు ఇంకా గుర్తుండే ఉంటుంది
నువ్వు కోపం నటిస్తూ నన్ను తరిమి తరిమి కొడ్తున్నప్పుడు
ఆవగింజంత ముళ్ళు నీ అరి కాలు లో నాటుకున్నప్పుడు
నన్ను ఎవరో కోసినట్లనిపించింది
ఆ జన - జల సమూహంలో
నిన్ను నేను ప్రేమ గా హత్తుకున్నాను
ఈ మెత్తదనం కొత్తగా ఉందన్నావ్
ఈ అనుభూతిని - ఈ స్పర్శని మరిచిపోలేనన్నావ్
నీ సబ్ మిసివ్ నేచర్ నన్ను కట్టి పడేసేది.
***
నేను అడగ్గా అడగ్గా నాతో ఔటింగ్ కొచ్హావ్
అక్కడ నేర్రలుబారిన భూమిలో
నీ పాదం ఇరుక్కొని
నువ్వు చిన్న పిల్లలా విలపించినప్పుడు
"ఇదే తెలంగాణా తండ్లాట "అని
యాబై యేండ్ల మా ఏడుపుని నీ చెవుల్లో విన్పించినప్పుడు
నేను అడక్కుండానే
ఒక లాంగ్ కిస్ నా పెదాలఫై ఇచ్చావ్
"జై తెలంగానా " అని నినధించావ్
అప్పుడు నా మొహంలో "వెయ్యి ఇంద్రధనుస్సులు కనిపిస్తున్నాయి" అన్నావ్
సముద్రంలా నువ్వు కూడా గొప్పఇంట్రోవర్ట్ వి
నీ లోలోన ఏ మూలన ఏముందో తెలియదు కాని
ఆ తంగేడు పూల పొదల్లో మనమిద్దరం రెండు సీతకోకచిలుకలమయ్యాం .
****
అదొక పనికిమాలిన వీకెండ్
జీరో విజిబులిటీ ఉన్న లొకేషన్
చిన్న చిన్న మాటలతో ఇంట్రెస్టింగ్ టేకాఫ్ ...
పెద్ద పెద్ద మాటలదాక వెళ్ళింది
అతడు "జాగో-బాగో " అనటం నచ్చలేధన్నావ్
"ఆ ఒక్కడు చస్తే బాగుండు ...నో మాన్ నో ఇష్యూ "అన్నావ్
ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం
ఒక భావజాలం ఇంకో భావజాలంతో డీకొన్న సందర్భం
నువ్వు పోటెత్తిన సముద్రానివయ్యవ్
ఎగిసెగిసి పడుతోన్న అలల్ని అలవోకగా ఎదురుకుంటూ
కోపంతో కొన్ని మాటలన్నాను
అంతే - నా మీద అంతెత్తున లేచి హిస్టీరిగ్గా అరిచావ్
"సౌండ్స్ వెరీ బ్యాడ్ ..ఐ హేట్ యు, ఐ హేట్ యు" అంటూ -
బెడ్ దిగి - బట్టలేసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా వెల్లిపోయవ్
****
కాంప్రమైజ్ అయ్యాం
"నీ సోషల్ ఆంగర్ తో నాకేం పని - నువ్వు కావాలంతే "అన్నావ్
కొంత కాలం అంత బాగానే ఉంది
మా వాళ్ళకి నిన్ను "తెలుగు అమ్మాయి"అని పరిచయం చేశాను
నువ్వు మీ నాన్నకి "తెలంగాణ అబ్బాయి" అని పరిచయం చేశావ్
అక్కడచ్చింది లొల్లి
లెక్కల స్టూడెంట్ వై వుండి ఎట్ల లెక్క తప్పావో తెలియదు
"కలిసుండి అందరినీ బాధ పెట్టడం కంటే - విడిపోయ ఆనందంగా ఉందాం " అని
ఒక కొత్త బ్రేకప్ థీయరీ చెప్పావ్
"నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు" అని జోష్యం చెప్పావ్
ఆ రోజంతా నా చేతిని వదలలేదు నువ్వు
ఆ హుస్సేన్ సాగర తీరాన
మనం కలిసి పీల్చిన ఆ చివరి గాలి లో
మౌనంగా సంభాషించుకుంటున్నసమయాన
వర్షం మన కోసమే మళ్లీ కురిసింది
బతుకుట ఎన్నాళ్ళు - భాగ్యమెన్నాళ్ళు ,అనుకుంటూ ..
ఆ వాన నీటి లో ఎంత కన్నీటిని కార్చాం
షేక్ స్పియర్ ని ఎన్ని సార్లు గుర్తుకు తెచ్చుకున్నాం
నిజంగా జ్ఞాపకాలన్నీ కన్నీటి ధారలే
****
"వద్దు ..నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను గుర్తుచేసుకోవద్దు
నాకు పదే పదే ఫోన్స్ చేయొద్దు "అన్నాను
నువ్వు వినకుండా మళ్ళీ ఫోన్ చేశావ్
"విడిపోవటం అంటే చెడిపోవటమే కదా-ఆత్మహత్యలతో తెలంగాణ వస్తుందా ?"
అని ప్రశ్నించావ్
"నువ్వు చెప్పిన బ్రేకప్ థియరీనే ప్రాంతాల మధ్య అన్వయించి చూడు " అన్నాను
ఎందుకో తెలియదు - నువ్వొక స్యాడ్ స్మైల్ ఇచ్చావ్
అంతేలే ..ఇప్పుడు నా మొహం లో ఇంద్రధనుస్సులతో నీకేం పని
ఏ రంగులో పొద్దు పొడిస్తే - ఆ రంగులోనే పొద్దుగూకుతుంది
ఇది ధర్మం - ఇదే ధర్మం !
పొగ చూరిన మా పొరాటాలగడ్డ మీద
ఇంకా నల్లని సాయంకాలాలని ఊహించొద్దు
ఒక్కసారి మీ సమైక్యవాదులంధరినీ తీసుకుని
మా బొందలగడ్డకు రా
అక్కడ ఎప్పటికీ తెరువని వందలజతల కళ్ళతో
ఒక తాత్విక చర్చ జరుపుదాం
సమాధులపై మొలచిన జవాబులు మీకు స్వాగతం పలుకుతాయి .

---------------ఉడుగుల వేణు
9059140338
udugulavenu @gmail .com